Konaseema

ఆడదాo ఆంధ్రా టోర్నమెంట్ సజావుగా నిర్వహించాలి…

WhatsApp Image 2024-01-31 at 6.54.01 PM (1)

క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జి.ఎం.సి. బాలయోగి స్టేడియం నందు జిల్లా స్థాయిలో ఆడదాo ఆంధ్రా టోర్నమెంట్ సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటన ద్వారా అధికారులకు సూచించారు. ఈ క్రీడల నిర్వహణ నిమిత్తం కొంత మంది అధికారులకు విధులు బాధ్యతలు కేటాయించడం జరిగిందన్నారు. జిల్లా స్థాయిలో క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించారు.

15 ఏళ్లు పైబడిన పురుషులు మరియు స్త్రీల కోసం విడి విడిగా ఐదు క్రీడాంశాలలో పోటీలు నిర్వహించాలన్నారు. క్రికెట్ ,వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో, బ్యాడ్మింటన్ క్రీడా పోటీ లను ప్రభుత్వం తెలియజేసిన షెడ్యూల్ ప్రకారం జి.ఎం.సి. బాలయోగి స్టేడియంలో 5 రోజులపాటు జిల్లా స్థాయిలో ఆడుదాo ఆంధ్రా నిర్వహించాలన్నారు. జిల్లాస్థాయిలో జిఎంసి బాలయోగి స్టేడియం నందు ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల ఓవరాల్ ఇన్చార్జిలుగా స్థానిక ఆర్డిఓ, జిల్లా చేనేత జౌళి శాఖ ఏడి ఇన్చార్జిలుగా వ్యవహరిస్తారన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-11-03 at 7.24.24 AM
Konaseema

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేపట్టండి… – జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్-

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి గత సీజన్లో ఉత్పన్నమైన సమస్యలు మరల పునరావృతం కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని అంబేద్కర్‌
WhatsApp Image 2023-12-03 at 9.27.32 PM
Konaseema

సముద్ర తీర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిషేధం… -జిల్లా ఎస్పీ-

తుఫాను సందర్భంగా ప్రస్తుతo తీరప్రాంతంలో తుఫాను ప్రభావముంటుందని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సముద్ర తీరంలో వనభోజన కార్యక్రమాలు వంటివి చేయరాదని అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ S.