వై.సీ.పీ. – టీ.డీ.పీ. పార్టీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఒకరినొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. స్థానిక స్టేట్ బ్యాంకు వద్ద టీ.డీ.పీ. నాయకులు కుడుముల శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన నివాసంలో చేరికలు ఉండడంతో టీ.డీ.పీ.శ్రేణులు, వర్గీయులు ఇంట్లో ఉన్నారు. పక్కనే మాజీ ఎం.పీ.పీ. మునిరాజా రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వై.సీ.పీ. శ్రేణులు, నాయకులతో ఉన్నారు.
ఎమ్మెల్యే మేన మామ అయిన మునిరాజా రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టీ.డీ.పీ. నాయకులు శశిధర్ రెడ్డి నివాసంలోకి చొరబడి దాడి చేశారు. ఘటనా స్థలానికి ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్ రెడ్డి రావడంతో ఇరువురు మధ్య తీవ్ర వివాదం నెలకొంది. దీంతో పరస్పరం రాళ్లు విసురుకున్నారు. మాజీ అధ్యక్షులు శివరామి రెడ్డి పై దాడి చేశారు. టీ.డీ.పీ. నాయకులు భూపేష్ రెడ్డి కార్యకర్తలు, శ్రేణులతో రోడ్డుపై బైఠాయించారు.అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు.

