సర్పంచుల యొక్క ప్రధాన డిమాండ్లుగా ఉన్న 16 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్స్ ఆఫ్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియారం సెంటర్లో మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు . 14,15 ఆర్థిక నిధులు కాజేసిన రాష్ట్ర ప్రభుత్వం కి అతిత్వరలో బుద్ధి చెపుతామని హెచ్చరించారు. సీ.ఎం. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు రంబాల రాంబాబు . నాగబత్తుల శాంత కుమారి సుబ్బారావు ,పరమట శ్యామ్ కుమార్ పెద్దిరెడ్డి రాము.నక్కా కృష తదితరులు పాల్గొన్నారు.
సర్పంచుల డిమాండ్లు తక్షణమే నెరవేర్చాలి…

