Viral

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ధర్నా…!!!

WhatsApp Image 2024-01-29 at 4.53.06 PM

రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం అందించే పెన్షన్, రాయితీల చెల్లింపుల్లో ఎదురవుతున్న జాప్యం పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ను ఉద్దేశించి ఏ.పి. ఎన్జీఓ మాజీ నాయకులు ఆచంట రామారాయడు మాట్లాడుతూ… గత 5 సంవత్సరాల నుండి పెండిగ్ లో ఉన్న పి.ఆర్.సి పరిష్కారం చేయాలని కోరారు.

హెల్త్ కార్డుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్య సేవలు అందించాలని అన్నారు. ప్రతీ నెలా 1 వ తారీఖున ఫ్యామిలీ పెన్షర్లకు పెన్షన్ అందక అనేక ఇబ్బందులు పడుతున్నారనీ తక్షణం 1వ తేదీన పెన్షన్ అందించి ఫ్యామిలీ పెన్షర్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపి ఎన్జీవో సంఘం నాయకులు పి. మూర్తి బాబు , పేపకాయల వెంకటకృష్ణ, రామ్మోహన్, అజీజ్, పలువురు పెన్షనర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.