Crime

హరి హర క్షేత్రం లో దొంగల బీభాత్సం….

WhatsApp Image 2024-01-28 at 8.44.00 PM

సామర్లకోట పట్టణంలోని అయిదు తూముల వద్దగల రైల్వే ట్రాక్ గోదావరి కాలువ వద్ద హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన అన్నపూర్ణ సమేత రామ లింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి దొంగలు బీభాత్సం సృష్టించారు. నలుగురు వ్యక్తులు ఆలయంలో ప్రవేశించి ప్రధానాలయం తాళాలు పగులగొట్టి అన్నపూర్ణ అమ్మవారి ఆలయంలో వెళ్లారు. అమ్మవారికి నకిలీ నగలు ధరించడంతో అవి నకిలీవని వదిలిపెట్టి వెళ్లారు. అనంతరం హుండీలను బయటకు తెచ్చి వాటిని పగులగొట్టారు.

అయితే ఇటీవలే హుండీలు ఖాళీ చెయ్యడంతో చెప్పుకోదగ్గ ఆధాయం లేకపోవడంతో ఆలయానికి పెద్దగా నష్టం వాటిల్లలేదు. అలాగే ఆలయంలో ఉన్న అర్చకుని మోటారు సైకిల్ ను దొంగిలించేందుకు ప్రయత్నించి మరలా దానిని తీసుకువచ్చి ఆలయం బయట ఉంచి దొంగలు పరారాయ్యారు. కాగా ఈ చోరీ యత్నం పై ఆలయ స్వామీజీ పరమానంద గిరి స్వామి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఆలయంలో చోరీ కి జరిగిన ప్రయత్నాలను పరిశీలించారు. ఈ మేరకు దీనిపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
WhatsApp Image 2023-10-13 at 9.48.30 PM
Crime

ఘర్షణకు పాల్పడ్డ SKBR కాలేజీ విద్యార్థుల పై చర్యలు….

అమలాపురం పట్టణంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీ విద్యార్థుల మద్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని అమలాపురం డి.యస్.పి.