ఫిబ్రవరి 4వ తేదీన విజయవాడలో జరిగే గ్రామీణ వైద్యుల రాష్ట్ర మహాసభ, ప్రపంచ కాన్సర్ దినోత్సవం వేడుకను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కాన్సర్ పై అవగాహన సదస్సు కు పీ.ఎం.పీ. లందరూ హాజరు కావాలని కమ్యూనిటీ పారామెడిక్స్, ప్రైమరీ హైల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమళ్ళ రాంబాబు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, తదితరులు అన్నారు.
ఆదివారం కాకినాడ లక్ష్మీ హాస్పిటల్ ఆవరణలో అసోసియేషన్ కాకినాడ అధ్యక్షులు సీ.హెచ్. ఏడుకొండలు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం, వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ… రాష్ట్రంలోని వివిధ గ్రామీణ వైద్యుల సంఘాల సమాఖ్య (ఫెడరేషన్) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4న విజయవాడలో జరిగే గ్రామీణ వైద్యుల రాష్ట్ర మహాసభ కు, ప్రపంచ కాన్సర్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న కాన్సర్ పై అవగాహన ర్యాలీ కి రావాలని కోరారు.
తొలుత కాకినాడ లక్ష్మీ హాస్పిటల్ ఎముకల వైద్య నిపుణులు డా. కే. ఉమాశంకర్ మాట్లాడుతూ… కీళ్ళ శస్త్రచికిత్సలలో రోబోటిక్ శస్త్రచికిత్స గురించి వివరించారు. డా. కె. రామానంద రెడ్డి, డాక్టర్ రేవూరి నవీన్ లు మాట్లాడుతూ… పీ.ఎం.పీ. లు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన కల్గిఉండాలని సూచించారు.

