ఆద్ర ప్రదాశ్ రాష్ట్రంలో జరుగున్న ఎలెక్ష్ దృష్య అక్రమ మద్యాలపై ఎక్సెజ్ అధికారులు, పోలీసులు ఉక్కుపాదం మోపారు. అందులో భాగంగానే అక్రమ అమ్మకాలు చేస్తున్న మద్యం షాప్ లపై పోలీసులు దాడులు చేస్తున్నారు. ఈ సందర్బంగా కాకినాడ జిల్లాకు చెందిన జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న రెండు షాపులపై పోలీసులు దాడిచేసారు.
ఆ దాడుల్లో దాదాపు 73 దొంగ మద్యం సీసాలను పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. ఈ తనికీలలో గండికోట వీర రాఘవులు షాపులో తనిఖీ చేయగా 30 మద్యం బాటిల్స్ ను, గండికోట సత్యనారాయణ షాపులో తనిఖీ చేయగా 43 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘాతకానికి పల్పడిన వారిద్దరిని అరెస్టు చేసి కేసు నమోదుచేసినట్లు పోలాసు అధికారులు తెలిపారు.

