ఎస్వీబీసీ మాజీ చైర్మన్, ప్రముఖ సినీ నటుడు శ్రీ పృథ్వీరాజ్, ప్రముఖ సినీ నృత్య దర్శకుడు శ్రీ షేక్ జానీ మాస్టర్ లు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పృథ్వీరాజ్, జానీ మాస్టర్ లకు పార్టీ కండువాలు మెడలో వేసి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎ
న్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, పార్టీ విధానాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో చురుగ్గా ముందుకు వెళ్లాలని, పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గారు తన కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు.

