రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతీష్టాత్మకంగా నిర్వహించిర జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా పెద్దాపూరం మండలంలో గోలి వారి సచివాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ త్సలికి సత్యభాస్కరరావు, కమిషన్ సురేందర్, కౌన్సిలర్స్ విరదాసరి నాగేంద్ర విచ్చేశి సురక్ష కార్యక్రమిన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ మాట్లాడుతూ… ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యంగా భావించి సీ.ఎం. జగన్ ఈ కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం వచ్చి రోగులను పరిక్షంచి సంబందిత పరిక్షలు చేసి వారికి తగిన మందులను పంపిణీ చేశారు. కమిషన్ సురేందర్, కౌన్సిలర్స్ విరదాసరి నాగేంద్ర, వాసంశెట్టి గంగ, డాక్టర్ అనూష తో పాటు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

