రజకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపడంలో నిర్లక్ష్య ధోరణి కనబర్చుతుందని రజక వృత్తిదారులను పౌర సేవలుగా గుర్తించి వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి మున్నూరు భాస్కరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్లోని ఇంద్రపాలెం రజక కమ్యూనిటీ హాల్లో కొజ్జవరపు నాగేశ్వరరావు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భాస్కరయ్య మాట్లాడుతూ… రజక వృత్తిదారులు నిరంతరం ప్రజలు శుభ్రంగా ఉండాలని సేవా వృతైన రజక వృత్తిని ఎంచుకొని ప్రజా శుభ్రత కోసం పనిచేస్తున్నారని కానీ రాష్ట్ర ప్రభుత్వం రజక వృత్తిని పౌరుసేవ వృత్తిగా గుర్తించకపోగా వృత్తి నిర్వహణలో యంత్రాలు ప్రవేశించినందువలన ఉపాధికి గండి పడే అవకాశం ఉందని వెల్లడించారు. రజక వృత్తిదారులకు స్టీమ్ ఐరన్ ఇస్త్రీ చేసేందుకు 250 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని అర్బన్ కేంద్రాల్లో మోడ్రన్ ధోబి గార్డ్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.
రజక వృత్తిదారులను పౌర సేవలుగా గుర్తించాలి…

