కాకినాడ జిల్లాకు చెందిన యూ. కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామంలో నియోజకవర్గ నలుమూలల నుండి జనసేన పార్టీ నాయకులు గాది కొండబాబు గారి ఆద్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి అధ్యక్షతలో 1500 మంది వివిధ పార్టీల నుండి జనసేన పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా వేసి ఆయన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇందులో 500 మందికి పైనే మహిళలు జాయిన్ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జరగబోయే ఎన్నికలలో జనసేన పార్టీ అధిష్టానం చేపట్టేలా జనసైకులందరూ కృషి చేయాలని సూచించారు.
1500 మంది జనసేన లోకి చేరిక…

