Trending News

జనసేన మత్స్యకార విభాగ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా మల్లాడి రాజు

WhatsApp Image 2024-01-22 at 4.34.07 PM

జనసేన పార్టీ మత్స్యకార విభాగ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా మల్లాడి రాజు నియమితులయ్యారు. ఈ మేరకు జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార విభాగ అధ్యక్షుడుగా ఆయనకి నియమకా పత్రాన్ని అందించారు. ఈ నియామక పత్రాన్ని అందుకున్న అనంతరం కాకినాడ చేరుకున్న ఆయన మాట్లాడుతూ… కాకినాడ నగరంలో గత 25 ఏళ్లుగా రాజకీయ పార్టీలలో వారు నియమించిన బాధ్యతలను శక్తి మేరకు నిర్వహించానన్నారు. ముఖ్యంగా ఎం.ఎస్.ఎన్ పరిరక్షణ సమితి చైర్ మేన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ఆస్తులను అన్యక్రాంతం కాకుండా అందరితో ఐక్యంగా కలిసి పలు దఫాలుగా వివిధ రూపాల్లో ఉద్యమాలు చేశామన్నారు.
దాన్ని గమనించిన జనసేన పార్టీ అధినేత పవన్ తనను మత్స్యకార విభాగంలో జిల్లా అధ్యక్షుడిగా నియమించడం చాల ఆనందకరమన్నారు. తన నియమాకానికి సహకరించిన నాయకులతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్, బొమ్మిడి నాయకర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన-టీడీపీ కూటమి విజయం సాధించి అన్ని వర్గాల ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని మల్లాడి రాజు చెప్పారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0020
Trending News

పోలీసు అమరవీరుల సంస్మరణలో రక్తదానం

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పెద్దాపురం రోటరీ ఫంక్షన్ హాలు నందు మెగా రక్తదాన శిబిరం రోటరీ, పెద్దాపురం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
IMG_20231030_161302
Trending News

పోలీసు కుటుంభాలకు వైద్య పరీక్షలు….

పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్