తెలుగు సినీ సటుడు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు యూ.ఎస్. కు చెందిన ప్రవాసాంద్రులతో టెలి కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రానున్న సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రాభివృద్ధికి జనసేన పార్టీకి చాలా కీలకమని, ప్రవాసాంధ్రులంతా పార్టీ గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఆయన కోరారు. అవకాశం ఉన్న ప్రతి ఎన్.ఆర్.ఐ జన సైనికుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని తమ నియోజకవర్గాల పరిధిలో పార్టీ గెలుపు కోసం అండగా ఉండాలని పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో పని చేసే అంశంపై వారికి దిశానిర్దేశం చేశారు. పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని, మన అధ్యక్షులు పవన్ కల్యాణ్ విశాల దృక్పథంతో తీసుకున్న నిర్ణయాలను సామాన్యులకు అర్ధం అయ్యేలా చేసే బాధ్యత తీసుకోవాలన్నారు.
యూ.ఎస్. జన సైనికులతో టెలి కాన్ఫరెన్స్ … -నాగబాబు-

