ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక అయినవిల్లి మండలంలోని వీరవల్లి పాలెం గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక గ్రామంలో కాపీ హోటల్ లో తెల్లవారు జామున విద్యుత్ లో లోపం వల్ల మంటలు చెలరేగాయి. హోటల్ యజమాని వచ్చి చూసేసరికి మంటలు చెలరేగుతూ కనిపించింది.వెంటనే యజమాని అమలాపురం అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చాడు. దానితో వారు ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేసారు.
వీరవల్లి పాలెం గ్రామంలో హోటల్ దగ్ధం…!!!
