భారత గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం హరినారాయణ ఆధ్వర్యంలో కోర్టుల సముదాయం పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమం శనివారం నిర్వహించారు. న్యాయమూర్తి హరినారాయణ మాట్లాడుతూ ఇంటితో పాటు చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని సూచించారు. మన ఆరోగ్యం పరిసరాల శుభ్రతపై ఆధారపడి ఉంటుందని అన్నారు.
కోర్టు లో పెండింగ్ కేసులు త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు న్యాయమూర్తులు , న్యాయవాదులు , కోర్టు సిబ్బంది కోర్టు చుట్టూ పరిసరాల శుభ్రంగా ఉంచడానికి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముత్తంటి విశ్వేశ్వరరావ న్యాయమూర్తులు నికిత ఆరోరా, తదితరులు పాల్గొన్నారు.

