కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని దేవనహళ్లిలో బోయింగ్‌కు చెందిన అత్యాధునిక గ్లోబల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలిపారు. నగరంలో జరిగే రోడ్ షో లో మోడీ పాల్గొనే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర బీ.జే.పీ. నేతలు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి రోడ్ షో కి అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు.
అదే రోజు తమిళనాడులో ‘ఖేలో ఇండియా’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. ఈ సందర్బంగా కర్ణాటక బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ మాట్లాడుతూ… మోదీ చేత రోడ్ షో నిర్వహించాలని మేము ప్లాన్ చేసామని మరియు ప్రధానమంత్రి కార్యాలయం నుండి అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు.

