తన నటనతో తెలుగు, తమిళ, మలయాళం సినిమా రంగములలో పేరుతెచ్చుకొని, ప్రజాధారన పొందిన సినీ నటి మీనా ఇప్పుడు రాజకీయ ప్రవేశంచేయబోతున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీలో బీ.జే.పీ. కేంద్ర సమాచార ప్రసార శాఖ సలహా మంత్రి ఎల్. మురుగన్ ఆద్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నటి మీనా ను పిలవడంతో ఆమె బీ.జే.పీ. లోకి వెళ్లే అవకాశాలున్నాయని పలు వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నరేంద్ర మోడీ తో కలిసి వేడుకలో పాల్గొనడంతో ఆ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
రాజకీయ ప్రవేశం చేయనున్న నటి మీనా…

