కాకినాడ జిల్లా తుని మండలం టి. వెంకటాపురం గ్రామంలో గల శ్రీ వివేక ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వ్యాసాధారణలు ఆకట్టుకున్నాయి. ఈ సంబరాల్లొ స్కూల్ విద్యార్థులు రకరకాల వేషధారణలతో, బసవన్నల గంగిరెద్దు నృత్యాలతో, హరిదాసు పాటలతో, సిరులు కురిపించే వరికుప్పల అందాలతో ఆకాటుకుంది. ఈ కార్యక్రమానికి కరస్పాండెంట్ సాధనాల సూరిబాబు, అకాడమిక్ డైరెక్టర్ జి. కృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… అనగారి పోతున్న ఆచారాలను వెలికి తీసే విధముగా మా చిన్నారులతో పూర్వ ఆచారాలను తెలియజేసి ఈ తరానికి ఒక మంచి సంకేతం వెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగిందన్నారు. కావున ప్రతి ఒక్కరూ అనగారిపోతున్న ఆచారాలను ముందుకు తీసుకువెళ్లాలని మా శ్రీ వివేక నాంది పలికింది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఎస్ మల్లేశ్వరరావు మరియు అధ్యాపక బృందం, విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.
తుని మండలం శ్రీ వివేక స్కూల్ లో సంక్రాంతి వేడుకలు…
