కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ కాకినాడ అర్బన్ లో శాంతి భద్రతల దృష్య కాకినాడ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లను ఎస్.హెచ్.ఎ. లతో కలిసి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాబోవు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిర్వహణ సజావుగా పూర్తి చేసే అంశాలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ లక్ష్యాల నివేదికల దృష్య కాకినాడలో 1టౌన్, 2టౌన్, 3టౌన్, పోర్ట్, ఇంద్రపాలెం శాంతి భద్రతల విభాగాల పోలీస్ స్టేషన్లను సమిక్షించామని తెలిపారు.
ఎస్పి ఎన్నికల కమిషన్ నిర్దేశించిన బైండోవర్స్ గంజాయి అక్రమ రవాణాకు, అక్రమ మద్యం, నాటు సారాయి, సంబంధించి రోజువారి నమోదు చేస్తున్న కేసుల గురించి అడిగి తెలుసుకున్నానన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతి పోలీస్ స్టేషన్ హౌజ్ అధికారి ప్రజల్లో సంబంభాలు మెరుగుపరుచుకుని అసాంఘిక కార్యాకలాపలను అడ్డుకోవాలని ఆదేశించారు. దీనికి సంబందించా ప్రతి రోజు నివేదిక సమర్పించాలని అననారు.
