రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీలు చేస్తున్న నికసన సమ్యే 30 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అంగన్ వాడీలు 30 వ రోజు సమ్మెను స్థానిక కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు కే. కృష్ణవేణి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ముఖ్య మంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమెండ్ చేశారు. సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై ఎస్మా చట్టం ఉపయోగించడం అమానుషమన్నారు. తమ న్యాయమయిన కోరికలను నెరవేర్చేవరకు సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీలు 30 వ రోజు నిరసన…

