Exclusive

భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని…!!! -కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్-

WhatsApp Image 2024-01-09 at 4.30.31 PM

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్ కింద అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులకు కావలసిన భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని రెవిన్యూ డివిజనల్ అధికారులకు జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో జే.సీ. అధ్యక్షతన జర్నలిస్ట్ హౌసింగ్ కమిటీ రెండోవ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జే.సీ. మాట్లాడుతూ… ఆన్లైన్ వెరిఫికేషన్ ద్వారా కమిషనర్ సమాచార పౌర సంబంధాలు విజయవాడ నుండి ఇప్పటి వరకు 225 ఇళ్ల స్థలాలు వచ్చాయన్నారు.
ఈ ఆన్లైన్ దరఖాస్తులను జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజనల్ అధికారులకు పంపినట్లు జే.సీ. తెలిపారు. వీటిలో అమలాపురం డివిజన్ కు సంబంధించి 128 దరఖాస్తులు, కొత్తపేట రెవెన్యూ డివిజన్ కు సంబంధించిన 49, రామచంద్రపురం డివిజన్ కు సంబంధించి 48 దరఖాస్తులు మొత్తం 225 దరఖాస్తులుగా ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం ఆర్డీవోలు జి. కేశవర్ధన్ రెడ్డి, ఎం. ముక్కంటి, ఎస్ సుధా సాగర్ లు తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.