ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గెలుపు ఓటములు ఆయా పార్టీలు అనుసరిస్తున్న విధానాలు, అమలు చేస్తున్న పథకాలను బట్టి ప్రభావం అవుతుంటాయి. అయితే అధికార వైఎస్ఆర్సీ పార్టీ ఇటీవల అనుసరించిన విధానాలు కొంత మేరకు ఓటమి భయంతో చేపట్టినట్టుగా స్పష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ అనుసరించిన విధానం సరైనది అయితే అభ్యర్థులు ఎవరైనా గెలిచితీరుతారు, అటువంటప్పుడు పాత అభ్యర్థులను మార్చాల్సిన పనిలేదు.
కాగా ఎమ్మెల్యేలకు, పార్టీ సీనియర్ నాయకులకు స్థాన భ్రంశం కల్పించడం వెనుక ఓటమి భయం ఉన్నట్టు స్పష్టమవుతోందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా వై నాట్ 175 నినాదానికి ఆదిలోనే హంసపాదు ఎదురైనట్టు అత్యధిక స్థానాలను కోల్పోవలసి వస్తుందని సుమారుగా అన్ని ప్రాథమిక సర్వేలు చెబుతున్నాయి.

