సమస్త దేవతా స్వరూపమైన గోపూజ నిత్యఅగ్నిహోత్రంతో సిద్ధించే ఐశ్వర్య ప్రదాయకమని ఉత్తమ తీర్థస్నాన ఫలం పొందే అదృష్టమని భోగిగణపతిపీఠం పేర్కొంది. ధనుర్మాస ఆఖరి సోమవారం సందర్భంగా కాకినాడ సూర్యారావు పేట దూసర్లపూడి వారివీధిలోని భోగిగణపతిపీఠం లో శ్రీవారి 8వ అన్నసమారాధన జరిగింది. అష్టగణపతికి 813వ సహస్రనామ జపయజ్ఞ పారాయణ, శివకేశవ ఆరాధన, గోమాతకు ముమ్మారు ప్రదిక్షణ లతో ఆగమ శాస్త్ర ప్రదాయకంగా గోపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ… తిరుమల పాద యాత్ర పూర్తిచేసి పంచలోహాల తాపడంతో స్వయంభువుకి చేపట్టిన కాంస్య కవచ యజ్ఞంలో శ్రీవారి పాదాల ప్రతిష్ట జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కార్తీకమాసం నవంబర్ 20 నుండి తలపెట్టిన 8వారాల బాలాజీ అన్నసమారాధన పూర్తయ్యిందని తెలిపారు.

