Exclusive

కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎస్మా ప్రతుల దగ్నం…

WhatsApp Image 2024-01-07 at 5.39.39 PM

సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్షులు దువ్వ శేషాబాబ్జి అధ్యక్షతన ఏ.పీ. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో అంగన్వాడీల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తీర్మానించారు. చట్టబద్ధంగా పోరాడే అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించి జగన్ ప్రభుత్వం తన భయాన్ని బయట పెట్టుకుందని కేంద్ర కార్మిక సంఘాలు ఎస్మా ప్రతులను అంగన్వాడీ దీక్షా శిబిరంవద్ద ధగ్నం చేశారు.

ఈ సందర్భంగా టిఎన్టియుసి జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబు, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత అయితాబత్తుల రామేశ్వరరావు, సీపీఎం జిల్లా కన్వీనర్ మోర్తా రాజశేఖర్,తదితరులు మాట్లాడుతూ… తెలంగాణా కంటే వెయ్యి అదనంగా చెల్లిస్తానని అంగన్వాడీలకు జగన్ ఇచ్చిన మాటను అమలు చేయాలని కోరుతూ గత 27 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఆడపడుచులపట్ల నిర్బంధాన్ని ప్రయోగించేందుకు ఎస్మా చట్టాన్ని జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిందని, తక్షణం అంగన్వాడీలపై విధించిన ఎస్మాని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.