Viral

అక్కడ తృటిలో తప్పిన భారీ ప్రమాదం…

WhatsApp Image 2024-01-06 at 3.58.41 PM

కాకినాడ రేచర్ల పేటలో అగ్నిప్రమాదం సంభవించి భారీగా మంటలు వ్యాపించడంతో స్థానిక యువకులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టి అగ్ని మాపక శాఖకు సమాచారం అందించారు. అడిషనల్ డిస్టిక్ ఫైర్‌ ఆఫీసర్ సుబ్బారావు తమ సిబ్బందితో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలో సుమారు మూడు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను నిలుపుదల చేయగలిగారు. ఈ సందర్భంగా ఏ డి ఎఫ్ ఓ సుబ్బారావు మాట్లాడుతూ రేచర్లపేట చర్చి ఎదురుగా ఉన్న పాత ఇనుప సామాన్లు దుకాణంలో యజమాని జిలాని తాను సేకరించిన వివిధ రకాల వస్తువులను గ్రేడింగ్ చేస్తున్న నేపథ్యంలో ఈ మంటలు చేల రేగినట్లు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం లేనప్పటికీ ఆస్తి నష్టం జరిగిందని, నష్టం వివరాల సేకరణ జరుగుతుందని ఏ డి ఎఫ్ ఓ సుబ్బారావు వెల్లడించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.