అయోధ్యలోని మర్యాద పురుషోత్తం శ్రీరామ మందిరంలో శ్రీ రామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ జనవరి నెలాఖరులో ఏర్పాటు చేయనున్న రామ్ లల్లా విగ్రహం ఎంపిక ప్రక్రియను పూర్తి చేసారు. జనవరి 22న జరిగే ప్రాణ్-ప్రతిష్ఠ అనే పవిత్రోత్సవానికి ముందు రాముడి బిడ్డ రూపాన్ని వర్ణించే రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్టు తెలిపారు.దినికి సంబందించి ముగ్గురు శిల్పుల నుంచి డిజైన్ లను ఎంపిక చేసి ట్రస్ట్ పరిశీలనలో ఉంచినట్లు చెప్పారు. రామాలయ గర్భగుడి లోపల ప్రతిష్ఠించడానికి 51 అంగుళాల పొడవు గల ఐదేళ్ల ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని తయారుచేసారు. రామజన్మభూమి తీర్థ క్షేత్రం ఎంచుకున్న విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన శిల్పి యోగిరాజ్ అరుణ్ చెక్కారు.
అయోధ్య రామ రామ్ లల్లా విగ్రహా ఎంపిక… -కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్-

