Exclusive

టిక్కెట్లు నిరాకరించినా తొందరపడొద్దు… -ఎంపీ భరత్-

bh

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు టిక్కెట్టు నిరాకరించినట్లయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎం.పీ. భరత్‌ సూచించారు. జగ్గంపేట వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పార్టీని వీడే అవకాశం ఉందన్న పుకారులపై ఎం.పీ. స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ చరిష్మా వల్లే గత ఎన్నికల్లో లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యామన్నారు.
వచ్చే ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.సీ.పీ. అధికారాన్ని నిలబెట్టుకుంటే రాజకీయంగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అఖండ విజయాన్ని అందిస్తే తమ సేవలను పార్టీ నాయకత్వం తగిన విధంగా గుర్తిస్తుందని వెళ్లడించారు. మిషన్ 175’లో భాగంగా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వై.ఎస్.ఆర్.సీ.పీ. నాయకత్వం మార్పులు చేయవచ్చని ఆయన అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.