Viral

అంగన్‌వాడీ సిబ్బంది సమ్మె విరమించకోవాలి… -మంత్రి విజ్ఞప్తి-

botsa-satyanarayana

అంగన్‌వాడీ సిబ్బంది డిమెండ్ నెరవేర్చాలని చేస్తున్న సమ్మె విరమించుకోవాలని గర్భిణులకు నెలవారీ షెడ్యూల్‌ ప్రకారం సంపూర్ణ పోషణ కిట్‌లను పంపిణీ చేయాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో గర్భిణులకు కిట్‌లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. బొబ్బిలిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎస్‌. అప్పలనాయుడు, ఎంపీ చంద్రశేఖర్‌తో కలిసి బొత్స ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా బొత్స మీడియాతో మాట్లాడుతూ… అంగన్‌వాడీ సిబ్బంది 11 డిమాండ్లలో 10 డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందన్నారు. అంగన్‌వాడీ సిబ్బంది జీతాల పెంపునకు సంబంధించిన 11వ డిమాండ్‌ను అంగీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, 2024 ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకున్న తర్వాత ఆ డిమాండ్‌పై నిర్ణయం తీసుకుంటామని ఆయన వెళ్లడించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.