తమిళనాడు రాష్ట్రంలో తూత్తుకూడి జిల్లాలో ఘోర రోడ్డు ప్రామాదం చోటుచేసుకుంది. తూత్తుకూడి జిల్లా కీల వల్లనాడు గ్రామంలో వేగంగా వెళ్తున్న ఓ టిప్పర్ లారీ రాంగ్ రూట్లో వెళ్తూ ఎదురుగా వెళ్తున్న వ్యాన్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యాన్ లో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని భాతితులను సమీప ఆసుపత్రికి తరలించారు. జరిగిని ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
వ్యాన్ను-టిప్పర్ ఢీ… ముగ్గురు మృతి
