విద్యాశాఖలో కీలక విధులు నిర్వర్తిస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ కేంద్రమంత్రి ఎం.ఎం. పల్లంరాజు అన్నారు. స్థానిక ధర్నా చౌక్ వద్ద గత పది ఆరు రోజులుగా వివిధ రూపాల్లో నిరసన దీక్షలు చేస్తున్న దీక్ష శిబిరాన్ని మాజీ కేంద్రమంత్రి సందర్శించి సంఘీభావం ప్రకటించారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ హయాంలో విద్యా ఉద్యోగ సంఘాలకు కలిగించే ఎన్నో సంస్కరణ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికారం వస్తే ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.
వై.సీ.పీ. ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది…

