రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చమని రాష్ట్రంలో అంగన్ వాడీ వర్కర్లు గత 17 రోజులనుంచి నిరసన కార్యక్రమాన్ని నిర్వహింస్తున్నారు. తాజాగా పిఠాపురంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద అంగన్ వాడీ వర్కర్లు నిరాహారదీక్షకు పూనుకున్నారు. తమకు కనీస వేతనం రూ. 26 వేలు చెయ్యాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరష్కారమయ్యేవరకు వెలకడుగు వేయ్యమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు తెలిపారు.
నిరాహార దీక్షకు పూనుకున్న అంగన్వాడీ వర్కర్లు…

