అమలపురంలో కామనగరువు గ్రామంలో జడ్పీ హైస్కూల్లో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల కార్యాక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు ఆ స్థానిక సర్పంచ్ నక్క అరుణకుమారి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… గ్రామా, వార్డూ, రాష్ట్ర్ స్థాయిలో యువతలో ప్రతిభను, క్రీడా స్పూర్తిని వెలుగు తీయాలనే సంకల్పంతో ఈ పోటీలను ప్రతష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ముందుకు నడవాలన్నారు. ఈ కార్యాక్రమానికి సర్పంచ్ నక్క అరుణకుమారి చంద్రశేఖర్ , ఉప సర్పంచ్ భాస్కరరావు, కార్యదర్శి రాజా, పీ.ఈ.టీ.లు. ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
అమలపురంలో ఆడుదం ఆంద్రా పోటీలు…

