మహా రాష్ట్రలో నాగ్ పూర్ లో కాంగ్రెస్ 139 వ ఆవిర్భావ దినోత్సవ వెడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వెడుకల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి దోహదపడిందని, భారత న్యాయ యాత్ర తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఎర్రకోటపై పార్టీ జెండాను ఎగురవేస్తామని అన్నారు. 56 అంగుళాల ఛాతీ ఉన్న వ్యక్తి మోదీ పార్లమెంటులోకి చొరబడకుండా అడ్డుకోలేకపోయారన్నారు. అలాగే ఎర్రకోటపై కాంగ్రెస్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడాన్ని కూడా ఆయన ఆపలేరన్నారు.
కాంగ్రెస్ 139 వ ఆవిర్భావ దినోత్సవ వెడుకలల్లో రేవంత్ రెడ్డి…

