సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 9వ రోజు సమ్మె నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సమ్మెకు ఏ.ఐ.టి.యు.సి. జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు హాజరైయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎవరి ప్రమేయం లేకుండానే కడుపుకాలి సమ్మె పోరాటంలోకి వచ్చారని, జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే సమ్మె చేయాల్సి వచ్చిందన్నారు.
అందుకు పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి వహించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా పార్ట్ టైం, డైలీ వేజ్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పేర్లతో రాష్ట్ర ప్రభుత్వమే సమగ్ర శిక్ష ఉద్యోగులను శ్రమదోపిడి చేస్తుంటే పోరాడక ఏం చేస్తారని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రంలో ఉద్యమ నాయకులు ఎం.రఘునాధ్,డి.వంశీకృషణంరాజు, పి.దుర్గాప్రసాద్, పూసలరావు, తదితరులు పాల్గొన్నారు.

