Exclusive

దొంగలు పడ్డ ఆరు నెలలకు…!!!

WhatsApp Image 2023-12-26 at 10.14.57 AM

పార్ట్ టైం పొలిటిషన్ ముత్తా శశిధర్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై చేసిన ఆరోపణలు ద్వారా తమ ఉనికిని కాపాడుకోవడం కోసం చేస్తున్న తపన తప్ప ఆరోపణల్లో వాస్తవాలు లేవని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి పేర్కొన్నారు. సోమవారం వైకాపా సిటీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దొంగల పడ్డ ఆరు నెలలకు కుక్కలు మెరుగాయన్న చందంగా ముత్తా శశిధర్ తీరు ఉందన్నారు. గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు నిజం కాదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అప్పట్లోనే నిరూపించుకున్నారని తిరిగి అదే ఆరోపణలను మళ్లీ మళ్లీ చేయడం వెనక ముత్తా శశిధర్ కు రాజకీయాలకు పట్ల ఉన్న అవగాహన రహిత్యం బయటపడుతుందన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.