గుంటూరులో ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ క్రీడలు నల్లపాడు లయోలాలో లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలు ఈ పోటీలను ప్రారంభిస్తారు. ఇప్పటివరకు 5.09 లక్షల ఆడుదాం ఆంధ్రా స్పోర్ట్స్ కిట్ల పంపిణీ చేసారు. ఈ పోటీలు 47 రోజులు 5 దశల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ క్రీడలకు 1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకుల రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు తెలిపారు. అత్యధికంగా క్రికెట్‌లో 13 లక్షల మంది, యోగ, మారథాన్, టెన్నీ కాయిట్‌లో 16 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ప్రతీ గ్రామంలో క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని సంబందిత అధికాకరులకు సీ.ఎం. ఆదేశాలిచ్చారు.

