కాకినాడ నగరం రామారావుపేటలో ఉన్న ప్రెస్ క్లబ్ భవనంలో కార్యదర్శులు అచ్యుత రామారావు, గునిపే శోభన్ బాబు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో బాగంగా కేక్ ను కట్ చేసి తమ ఆనందాన్ని సభ్యులకు తెలియజేసారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ… అన్ని మతాలను గౌరవించాలని వారి పండుగలను కూడా ప్రెస్ క్లబ్ భవనంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఐక్యత ద్వారా ఏదైనా సాధించవచ్చని అన్నారు. పలువురు జర్నలిస్టులు క్రిస్మస్ సందేశాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి సుబ్బారావు, రాజు సుబ్బారావు, రమేష్, పుర్రె త్రినాథ్, వల్లూరి నానాజీ, తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ ప్రెస్ క్లబ్ లో క్రిస్మస్ వేడుకలు…

