కోవిడ్-19 యొక్క జే.ఎన్. 1 సబ్-వేరియంట్ దేశంలో పెరుగుతున్న కారణంగా మిజోరం ప్రభుత్వం క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగ సీజన్ లో కోవిడ్ జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలను జారీ చేసింది. జే.ఎన్. 1 సబ్-వేరియంట్ కేసులేవీ లేనప్పటికీ, ఆరోగ్య మంత్రి లాల్రిన్‌పుయి ముందు జాగ్రత్త చర్యల యొక్క క్లిష్టమైన అవసరాన్ని పేర్కొన్నారు. శాన్య రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి భయాందోళన పడనవసరం లేదని లాల్రిన్‌పుయి హామీ ఇచ్చారు. అయినప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతాలలో జే.ఎన్.1 సబ్-వేరియంట్ కేసుల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని అప్రమత్తంగా ఉండవలసిన ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు.
JN.1 సబ్-వేరియంట్ కు ముందస్తు జాగ్రత్త ప్రకటించిన మిజోరాం ప్రభుత్వం…
