ఏలూరు జిల్లాలో పోలవరం జాతీయ ప్రాజెక్టును రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్‌లాల్ పాటిల్ సందర్శించారు. అక్కడ స్థానికులతో ఆయన సమావేశమై వివరాలను తెలుసుకున్నారు. నాలుగేళ్లుగా ప్రాజెక్ట్ కు సంబందించి ఎటుంంటి నిర్మాణం చేపట్టలేదని, నిర్వాసితులకు కూడా ఎలాంటి న్యాయం జరగలేదని గమనించారు.
ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించే ఈ జాతీయ ప్రాజెక్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పూర్తికావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రాజెక్టు నిర్మించినా అక్కడి నివాసితులకు సౌకర్యాలు కల్పించిన తర్వాతే ముందుగా ప్రాజెక్టును పూర్తి చేస్తారు. మన దేశంలో శరణార్థులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలని, ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

