బలభద్రపురంలో అభివృద్ధి పనులు చేపట్టారు. వై.సీ.పీ. కన్వీనర్ నల్లమిల్లి వెంకట రెడ్డి, సర్పంచ్ బుంగా రామారావు నేతృత్వం లో అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నారు. ఈ వెంకట రెడ్డి సందర్బంగా మాట్లాడుతూ.. గంగాలమ్మ తల్లి సెంటర్ నుండి 2వ వార్డు సచివాలయం వరకు ఉన్న మామూలు డ్రైన్ లను సిమెంట్ డ్రైన్ గా నిర్మిస్తున్నామని చెప్పారు. పాత సంత మార్కెట్ వీధి నుండి రాజానగరం వెళ్లే రోడ్డు కి కలిసే చిన్న రోడ్డు ను పెద్ద సిమెంట్ రోడ్డు గా తయారు చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులకు రూ.1 0 లక్షల రూపాయిలు గడప గడప కు మన ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టారని అన్నారు.
బలభద్రపురంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు…

