కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో తాజాగా115 కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయనట్లు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రంలో వైరస్ యొక్క మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 1,749కి చేరుకుందని తెలిపింది. దేశవ్యాప్తంగా నమోదైన 142 కేసుల్లో కేరళలో 115 కేసులు ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెబ్సైట్ వెల్లడించింది. కాని ఉప్పటి వరకు రాష్ట్రంలో వైరస్ కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదని చెప్పింది. ఇన్ఫెక్షన్ వచ్చిన తరువాత కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 112కి చేరుకుందని వెల్లడించింది.
కేరళలో తాజాగా 115 కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు నమోదు…

