సామర్లకోట పట్టణ పరిధి 9వ వార్డు పెన్షన్ లైన్ కు చెందిన 60 మంది వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇంచార్జి తుమ్మల బాబు సమక్షంలో జనసేన లోకి చేరారు. పార్టీ నాయకులు సరోజా వాసు, జానకి రామారావు, మంచెమ్ సాయిబాబులు ఆధ్వర్యంలో ఈ మేరకు పెన్షన్ లైన్లో జనసేన సభ నిర్వహించారు. జనసేనపార్టీ సిద్ధాంతాలను బాబు ప్రజలకు వివరించారు. అధిక సంఖ్యలో దళితులు పాల్గొని జనసేనకు జేజేలు పలికారు.
జనసేనలోకి చేరిన వై.సీ.పీ. కార్యకర్తలు…
