ఏ.పీ. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీ.ఐ.టీ.యు. కాకినాడ జిల్లా కమిటీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కేంద్ర మాజీ మంత్రి, సీ.డబల్యు.సీ. మెంబర్ ఎం.ఎం. పల్లం రాజు ఆదేశాల మేరకు ప్రత్తిపాడు నియోజకవర్గంలో MRO ఆఫీస్ నందు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, కిసాన్ సెల్ కోఆర్డినేటర్ ఉమ్మిడి వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మిడి వెంకటరావు మాట్లాడుతూ… అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు రొంగల ఈశ్వర రావు, జిల్లా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్, ప్రత్తిపాడు నియోజకవర్గంలో వివిధ సంఘాల నాయకులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అంగన్వాడీ వర్కర్స్ మహా ధర్నాలో కాంగ్రెస్ నాయకులు…

