Exclusive

జర్నలిస్ట్లకు ప్రత్యేక  వైద్య శిబిరాలు…             – డాక్టర్ పితాని అన్నవరం  – 

IMG-20231209-WA0039

 సమాజంలో తలెత్తే సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి విశేష కృషి చేస్తున్న పాత్రికేయులకు ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ పితాని అన్నవరం తెలిపారు. పాత్రికేయులకు అవసరమైన వైద్య పరీక్షలతో పాటు మందులను అందించి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేందుకు తాను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని విలేకరులకు చెప్పారు. ఇటీవల కాలంలో యువ పాత్రికేయుడు రెడ్డి నాయుడు బాబు ఆకస్మిక మరణం తనను ఎంతగానో కలచి వేసిందన్నారు. నాయుడుతో తనకు ఎనలేని ఆత్మీయ అనుబంధం ఉందని చెప్పారు. అందువల్లనే విలేకరులకు తను మిత్రుడుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నానని చెప్పారు.

తనను రాజకీయంగా ఉన్నత స్థానంలో నిలిపేందుకు సహకరించాలని ఆకాంక్షించారు. రాజకీయంగా తాను వైసీపీలో కీలక బాధ్యత నిర్వహిస్తున్నానని తెలిపారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినప్పుడు సీఎం జగన్ అందిస్తున్న పథకాలు ఇంకా అర్హులైన పేదలకు అందటం లేదని అవి అందాలంటే తాను రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని ఆలోచన వచ్చిందన్నారు. తాను రాజకీయంగా ఎదిగేందుకు పాత్రికేయులు సహకరించాలనీ కోరారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.