డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమం ఎస్ అచ్చితపురం జై భీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. సి.పి.ఐ. కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ముందుగా ఆయన విగ్రహానికి వివిధ రంగాల ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
తాటిపాక మధు మాట్లాడుతూ… అంబేద్కర్ పోరాట స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను రచించారని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. దళిత ప్రజానీకం వాటిని కాపాడుకోవాల్సిన అవసరముందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది టి. ముఖేష్ ,సిపిఐ నగర కార్యదర్శి టి అన్నవరం ప్రముఖ దళిత నాయకులు దేవరాజ్ కృష్ణ చిన్ని డేనియల్ ఏఐవైఎఫ్ నగర కన్వీనర్ కాశి తదితరులు పాల్గున్నారు
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుకుందాం…

