మిచౌంగ్ తూఫాన్ తో కృష్ణాజిల్లా లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు ఎడతెరుపులేకుండా కురుస్తూనే వున్నాయి. ఈ ప్రభావం తో కృష్ణాజిల్లా మొత్తం జలదిగ్బంధం అయ్యింది. జిల్లాలో రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోకీ, పంట పొలాల్లోకి భారీగా వర్షపు నీరు చేరుకుంది. దానితో పంట పొలాలు నీటితో తడిసి అన్నదాతకు కన్నీటిని మిగిల్చింది. నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో బందరు నగరం సముద్రాన్ని తలపిస్తుంది. ఎటు వెళ్లాలన్న రోడ్లు అన్ని వర్షపు నీటిలో మునిగి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది.
మిచౌన్గ్ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది…
