జిల్లా లో సిద్దవటం మండలం లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మిచౌంగ్ తూఫాన్ ప్రభావం వల్ల కడప జిల్లా లో సిద్దవటం మండలం భాకరాపేట సమీపం మలిలేని పట్నం గ్రామం వద్ద చెట్టు విరిగి పడింది. ఈ ప్రమాదంలో 11 బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ పై చెట్టు విరిగి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కడప నుండి భాకారపేట వద్ద ఉన్న బెట్టాలియన్ కు వెళుతుండగా జరిగిన ఘటనట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఘటనలో మృతి చెందిన వ్యక్తి సత్య కుమార్ గా గుర్తించినట్లు సిద్ధవటం పోలీసులు తెలిపారు.సత్య కుమార్ సొంత ఊరు చెన్నూర్ గా పోలీసులు పేర్కొన్న.
చెట్టుపడి పోలీసు మృతి…

