Exclusive

తుఫాన్‌ పట్ల అప్రమత్తంగా ఉండండి… టోల్‌ప్రీ నెంబర్‌ 1800 4255 990 కాల్‌ చేయండి…

WhatsApp Image 2023-12-02 at 4.50.30 PM

తుఫాన్‌ హెచ్చరికల నేపద్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ సీ.హెచ్‌. నాగనరసింహారావు సంబంధిత అదికారులను ఆదేశించారు. స్థానిక కార్పొరేషన్‌ కార్యాలయంలో వివిధ విభాగాధిపతులు, ప్రత్యేకాధికారులతో ఈ అంశంపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ… రానున్న ఒకటి రెండు రోజుల్లో ఈదురు గాలులు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ఆయా డివిజన్లకు చెందిన ప్రత్యేకాధికారులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా చెట్లు, విద్యుత్‌ స్థంబాలు, హోర్డింగ్‌లు పడిపోవడం వంటి సంఘటనలు ఎదురైతే తక్షణమే సమస్య పరిష్కరించేలా సిద్ధంగా ఉండాలని సూచించారు. అలాగే తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న డివిజన్లలో ముంపుకు గురికావడం, వర్షాలు వల్ల ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఎదురైతే సామాజిక భవనాలు, ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.