తెలుగుదేశం పార్టీ యువనేత లోకేష్ ఆధ్వర్యంలో సాగుతున్న యువగళం పాదయాత్రకు కాకినాడ టీ.డీ.పీ. శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. కాకినాడ పరిసర ప్రాంతంలోని చొల్లంగి విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్రగా బయలుదేరి ఎమ్.ఎస్.ఎన్. చార్టీస్, జగన్నాధపురం ఎన్టీఆర్ బ్రిడ్జి, సినిమా రోడ్డు, కోకిల సెంటర్ మీదుగా కొనసాగింది. ఆయన పాదయాత్రకు అడుగడుగున కాకినాడ ప్రజలతో పాటు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన వెంట నడిచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం వై.సీ.పీ. పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని 2024 ఎన్నికల్లో టీ.డీ.పీ.- జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే సత్తా మనందరి నాయకుడు చంద్రబాబుతోనే సాధ్యమని గ్రహించి ప్రజలు నమ్మకంతో తమ వెంట నడుస్తున్నారన్నారు.

