ఆశ వర్కర్లకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరుతూ డిసెంబర్ 11, 12 తేదీలలో జిల్లా కలెక్టరేట్ దగ్గర 36 గంటల ధర్నా నిర్వహిస్తామని ఆశ వర్కర్స్ యూనియన్ (సి.ఐ.టి.యు.) తెలిపారు. స్థానిక సిఐటియు ఆఫీసులో నర్ల ఈశ్వరి అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షురాలు జీ. బేబీ రాణి మాట్లాడుతూ… ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశ వర్కర్లకు 10,000 రూపాయలు వేతనం ఇస్తున్నామని చెప్పి పని భారాన్ని పెంచి 24 గంటలు చాకిరీ చేస్తున్నారని అన్నారు.
పదివేల రూపాయలు వేతనం ఇస్తున్నామని సాకుతో సంక్షేమ పథకాలన్నీ రద్దుచేసి ఆశ వర్కర్లను దారుణంగా మోసం చేసారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో రాయుడు నాగలక్ష్మి, మొగలి బేబీ, జి మంగారత్నం, వి. ఉమా వతి సత్యవతి, ఉమాదేవి, గ్రేస్ తదితర నాయకులు పాల్గొన్నారు

